తల తెగినా మోడీకి తల వంచను
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల తెగ కోసినా తాను మోడీకి తలవంచే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. తమకంటూ ఓ స్ట్రాటజీ ఉందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంతటి క్యాడర్ తమకు ఉందని స్పష్టం చేశారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ దేశంలో సార్వత్రిక ఎన్నికలపై స్పందించారు. బీజేపీకి సీట్లు తగ్గినా లేదా పెరిగినా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. జనం మోదీని, బీజేపీ ఆడుతున్న నాటకాల గురించి తెలుసుకున్నారని తేలి పోయిందన్నారు.
ఎంత మందిని కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో వేధింపులకు గురి చేసినా, కేసులు నమోదు చేసినా , అరెస్ట్ లు చేస్తామని బెదిరింపులకు గురి చేసినా వెనక్కి తగ్గ బోమంటూ హెచ్చరించారు. ఇంకెంత కాలం కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నించారు.
విద్వేషాల పునాదులపై ఓట్లు పొందాలని అనుకుంటున్న బీజేపీకి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. తమకు 17 స్థానాలకు గాను 14 సీట్లు పక్కాగా వస్తాయని చెప్పారు కేటీఆర్.