SPORTS

చెన్నై నిలిచేనా రాజస్థాన్ గెలిచేనా

Share it with your family & friends

స‌మ ఉజ్జీల స‌మ‌రానికి వేళాయెరా

చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది త‌మిళ‌నాడులోని చెన్నై. ప్లే ఆఫ్స్ కు వెళ్లాల‌న్నా , 17వ సీజ‌న్ లో క‌ప్ గెల‌వాలంటే త‌ప్ప‌నిస‌రిగా రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం.

ప్ర‌ధానంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌లో స‌త్తా చాటినా దుర‌దృష్టం కొద్దీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మూడు మ్యాచ్ ల‌ను చేజార్చుకుంది. ఆ జ‌ట్టుకు చెన్నై కింగ్స్ తో అత్యంత కీల‌కం. ఇప్ప‌టికే పాయింట్ల ప‌ట్టిక‌లో దూసుకు పోయింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్.

రేస్ లో నిల‌వాలంటే ఇరు జ‌ట్ల‌కు త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్ప‌టికే త‌మిళ తంబిలు పెద్ద ఎత్తున టికెట్ల‌ను కొనుగోలు చేశారు. మ్యాచ్ చూసేందుకు స్టేడియం వైపు ప‌రుగులు తీస్తున్నారు.

ఇక మాజీ కెప్టెన్ ధోనీ ఆశించ‌ని మేర ఆడ‌డం లేదు. ఇక రాజ‌స్థాన్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడుతున్నాడు. మిగ‌తా వారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎవ‌రు నిలుస్తార‌నే దానిపై ఇవాళ్టితో తేలి పోనుంది.