గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవ‌లు అందించాలి

తిరుమ‌ల : జాతిపిత మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపీనాథ్ కోరారు. స్వచ్ఛత, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో శ్రీవారి దర్శనానికి వచ్చే పవిత్రమైన టీటీడీలో ప నిచేయడం మన అదృష్టమని, సేవా భాగ్యమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి మానవతా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని సూచించారు. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో సత్యం, అహింస మార్గాల ద్వారా ప్రజలను ఏకం చేసిన గాంధీజీ, సామాజిక అసమానతల నిర్మూలనకు, అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో ఆనందరాజు, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్సువర్ణమ్మ, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, సీఏవో వేంకటరమణ, శ్వేత ఇన్‌చార్జి సంచాలకులు డా. వేమా వెంకట రత్నం, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

    తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం తిరుమ‌ల‌కు విచ్చేశారు. ఆయ‌నసింగపూర్ హోం శాఖ మంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించు కునేందుకు సోమవారం…

    ఘ‌నంగా వీర శైవ లింగాయ‌త్ ధ‌ర్మ సంర‌క్ష‌ణ స‌మ్మేళ‌నం

    బెంగ‌ళూరు : అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థ (రెజి.) , అఖిల భారత వీరశైవ లింగాయత్ మహా సభల సంయుక్త ఆధ్వర్యంలో బెంగళూరులోని విజయనగరంలో జరిగిన వీరశైవ లింగాయత్ ధర్మ సంరక్షణ సమ్మేళనాన్ని పవిత్ర జగద్గురువు పంచ పీఠాధీశ్వరుల వారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *