ఏపీకి భారీగా ఆర్టీసీ బస్సులు
వెల్లడించిన ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఏపీ రాష్ట్రానికి చెందిన ప్రజలకు తీపి కబురు చెప్పారు. భారీ ఎత్తున ఇక్కడ కొలువు తీరారు. దీంతో మే 13న ఏపీలో అటు శాసన సభ , ఇటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున బస్సులను ఏర్పాటు చేసింది. మరో వైపు టీఎస్ఆర్టీసీ సైతం బస్సులను సౌకర్యార్థం నడుపుతున్నట్లు ప్రకటించారు వీసీ సజ్జనార్. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన ఈ కీలక అంశం వెల్లడించారు.
స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఏపీకి వెళ్లేందుకు గాను ఇప్పటి వరకు మొత్తం 590 స్పెషల్ సర్వీస్ బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు.
ఇందుకు గాను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.. ఆయా బస్సుల్లో దాదాపు ౩ వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఎండీ. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించు కోవాలని కోరారు.
అలాగే, హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతున్నట్లు పేర్కొన్నారు.