మోదీ కాదు అమిత్ షానే ప్రధాని
బాంబు పేల్చిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తనను నామ రూపాలు లేకుండా చేయాలని, ఆప్ ను దెబ్బ కొట్టాలని, ఢిల్లీలో సర్కార్ ను కూల్చాలని కుట్రలు పన్నారంటూ ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో తనను ఇరికించడమే కాకుండా తీహార్ జైలుకు పంపించడంపై మొదటి నుంచీ ఒకే మాట మాట్లాడుతూ వస్తున్నారు ఢిల్లీ సీఎం . తాను ఏ తప్పూ చేయలేదని, తాను అమాయకుడినని, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేసిన సమయంలో ఒక్క రూపాయి కూడా అక్రమంగా దొరక లేదని స్పష్టం చేశారు. అయినా వినిపించు కోలేదు. ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది లోపల పెట్టింది.
చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో , మధ్యంతర బెయిల్ దక్కడంతో అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చారు. వచ్చీ రావడంతోనే బాంబు పేల్చారు. బీజేపీలో 75 ఏళ్ల వరకే పదవుల్లో ఉంటారని , ఈ మేరకు మోదీకి 75 నిండుతున్నాయని, ఇక కాబోయే ప్రధాని అమిత్ చంద్ర షానేనంటూ పేర్కొన్నారు.