NEWSANDHRA PRADESH

రిజ‌ర్వేష‌న్ల‌పై బాబు కామెంట్

Share it with your family & friends

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు

న్యూఢిల్లీ – రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఇక పోలింగ్ జ‌రిగేందుకు కేవ‌లం కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు జాతీయ మీడియాతో సంభాషించారు.

రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌న్నారు. దీనిపై రాజ‌కీయాలు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

అప్పులు చేయ‌డం అభివృద్ది కాద‌న్నారు. సంప‌ద‌ను సృష్టించడం వాటిని అంద‌రికీ పంచ‌డం అన్న‌ది త‌మ పార్టీ ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ బాస్. టీడీపి, జ‌న‌సేన‌, బీజేపీ మేనిఫెస్టో పూర్తిగా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా, రాష్ట్ర అభివృద్ది కోసం ప్ర‌య‌త్నం చేసేలా ఉంద‌న్నారు.

శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో 175 స్థానాల‌కు గాను త‌మ‌కు క‌నీసం 160కి పైగా వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఇక లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి 25 స్థానాల‌కు గాను 21 స్థానాలు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.