NEWSTELANGANA

బీజేపీ బీఆర్ఎస్ ఒక్క‌టే

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – బీజేపీ బీఆర్ఎస్ ఒక్క‌టేన‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. త‌మ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కీల‌క కామెంట్స్ చేసిన కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది టీపీసీసీ. ఈ మేర‌కు ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. తాము ఏం చెప్పామో అది చేసి చూపించామ‌ని, ఆ మాత్రం దానికి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ కు చెందిన నేత‌లు ఎవ‌రూ బీజేపీ గురించి ప‌ల్లెత్తు మాట్లాడటం లేద‌ని ఆరోపించింది. ప్ర‌జ‌లు దీనిని గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రించింది. ఒక ర‌కంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీగా మారి పోయింద‌ని ఆరోపించింది.

దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే పదేళ్ల బీజేపీ పాలన పై, మోడీని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్.. ఒక్క బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టని 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీసింది టీపీసీసీ.

లిక్క‌ర్ కేసులో క‌విత‌ను త‌ప్పించేందుకే ఏమైనా ఒప్పందం కుదిరిందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని పేర్కొంది.