ఖాకీలపై సీఈసీ కన్నెర్ర
నంద్యాలలో కోడ్ ఉల్లంఘన
అమరావతి – ఎన్నికలలో భాగంగా నంద్యాల జిల్లా పోలీసులపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కోడ్ ను ఉల్లంఘించి భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. పోలీసులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదంటూ మండిపడింది.
ఇదే సమయంలో అల్లు అర్జున్ తో పాటు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా 144 సెక్షన్ అమలులో ఉన్నా జన సమీకరణకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది.
ఈ మేరకు నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ను అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడని మండిపడింది. శాఖా పరమైన విచారణ జరపాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.