సీఎం రేవంత్ రెడ్డి వైరల్
ఫుట్ బాల్ ఆడిన టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వైరల్ గా మారారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చర్చ కావాల్సిందే. మోస్ట్ పాపులర్ నాయకులలో ఒకరుగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో రాదని అనుకున్న కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు అంశాలపై తనదైన శైలిలో జవాబు ఇస్తూ అందరినీ విస్తు పోయేలా చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో నిన్నటి దాకా ఎన్నికల ప్రచారం ఉండేది. నిన్నటితో పరిసమాప్తం అయ్యింది. లెక్కలేనన్ని సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలు , సమీక్షలతో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా రిలాక్స్ కావాలని అనుకున్నారు.
ఆయన ఎవరూ ఊహించని రీతిలో ఉన్నట్టుండి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్శిటీకి వెళ్లారు. అక్కడ సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఆట మధ్యలో షూ పాడై పోయినా షూస్ లేకుండానే ఫుట్ బాల్ ఆడారు.
ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కి సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ,ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏం ఏ ఫహీం,టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ఇతరులు హాజర్యారు. హెచ్ సీ యూ , ఎన్ఎస్ యు ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ చేపట్టారు.