చెన్నై టార్గెట్ 142 రన్స్
రాజస్థాన్ తక్కువ స్కోర్
చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా కీలకమైన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం ఒకింత ఇబ్బంది కలిగించింది. పిచ్ పూర్తిగా బౌలర్లకే సహకరించింది. దీంతో పరుగులు చేసేందుకు బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 141 రన్స్ మాత్రమే చేశారు.
దీంతో చెన్నై ముందు 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది రాజస్థాన్ రాయల్స్. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పనిసరి ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది చెన్నై. ప్రధానంగా సిమర్జిత్ సింగ్ 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక తుషార్ దేశ్ పాండే 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. టాప్ ఆర్డర్ చేతులెత్తేస్తే రియాన్ పరాగ్ మాత్రం ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 47 పరుగులు చేశాడు.
కష్ట కాలంలో ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ శాంసన్ అనవసర షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్ష్యం చిన్నది కావడంతో చెన్నైకి గెలుపు లాంఛన ప్రాయమేనని అనిపిస్తోంది.