ప్యాలెస్ లు కాదు ప్రజలు కావాలి
ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్
హైదరాబాద్ – ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలనంగా మారారు. ఆయన సార్వత్రిక ఎన్నికల వేళ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ తో జరిగిన సంభాషణలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాలస్ లు నిర్మించుకుని కూర్చుంటే జనం ఎలా నమ్ముతారని అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు . ఈ కామెంట్స్ ను ప్రత్యేకించి ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ దారుణమైన ఓటమిని చవి చూడ బోతోందని జోష్యం చెప్పారు. కనీసం ఆ పార్టీకి 51 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదన్నారు. మరోసారి సీఎం కావాలని అనుకోవడంలో తప్పు లేదన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయని తెలుసుకుంటే మంచిదన్నారు.
జగన్ రెడ్డి అధికారం ఉంది కదా అని తప్పుల మీద తప్పులు చేస్తూ పోయాడని, చివరకు అవే తనను అధికారం నుంచి వెళ్లగొట్టేలా చేయబోతోందని హెచ్చరించారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం నడుస్తుందని చెప్పలేమన్నారు. ఎందుకంటే ప్రజలలో మార్పు మొదైలందని అది ఏ రూపంలో ఉంటుందో ఎవరూ చెప్పలేరన్నారు ప్రశాంత్ కిషోర్.
నేతలు ఎవరైనా సరే ప్యాలెస్ లు నమ్ముకుంటే పవర్ లోకి రారని, ప్రజలను నమ్ముకుంటే వస్తారని తెలుసుకుంటే మంచిదన్నారు.