తెలుగు రాష్ట్రాల్లో రేపే పోలింగ్
ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల దాకా
ఏపీ, తెలంగాణ – ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లలో మే 13 న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. బ్యాలెట్ బాక్సులు సిద్దం చేశాయి. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేశారు. రాష్ట్ర దళాలతో పాటు పారా మిలటరీ దళాలు కూడా మోహరించాయి. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు .
మొత్తంగా ఎన్నికల ప్రచారం ఇరు రాష్ట్రాలలో మే 11న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఏపీలో ఇటు శాసన సభకు, అటు లోక్ సభకు పోలింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక్కడ వైసీపీ , టీడీపీ కూటమి (జనసేన, బీజేపీ) తో పాటు కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే శాసన సభ ఎన్నికలు ముగియడంతో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ , బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. జూన్ 4 తర్వాత ఏం జరుగుతుందనేది తేలనుంది.