కన్హయ్య సత్తా చాటాలి – కేజ్రీవాల్
యువ నేతకు సీఎం హితబోధ
న్యూఢిల్లీ – భారత కూటమి తరపున ఈశాన్య ఢిల్లీ నుంచి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా కాంగ్రెస్ యువ నాయకుడు కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మర్యాద పూర్వకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఎలా గెలవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు గంటకు పైగా చర్చించారు. ఎలా బీజేపీ దాడుల నుంచి ఎదుర్కోవాలి, ఎలా గెలుపు దిశగా ప్రయాణం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత మార్చి నెలలో అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయనను సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదల చేసింది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఆప్ సాదర స్వాగతం పలికారు.
ఈసారి భారత కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉంది. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున సీట్లు రానున్నాయని సర్వత్రా సమాచారం అందుతోంది. ఢిల్లీలో కూటమితో పాటు ఆప్ జెండా ఎగుర వేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు . మొత్తంగా కన్హయ్య కుమార్ సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.