ఆరోపణలు పూర్తిగా అబద్దం
భారత రాష్ట్ర సమితి కామెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేభారు. బీఆర్ఎస్ బీజేపీగా మారి పోయిందంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడాన్ని తప్పు పట్టింది. ఈ సందర్బంగా కౌంటర్ ఇచ్చింది. ఎవరు ఎవరితో జత కట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొంది బీఆర్ఎస్.
లోక్సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపికి మేలు చేసి.. బీజేపీని పొగిడి మోడీకి దగ్గరవుదాం అని చూస్తుంది.. బీజేపీతో అంట కాగుతుంది మీ కంపు మేస్త్రి కాదా అని ప్రశ్నించింది. బడే భాయ్ అంటూ మోదీని ప్రసన్నం చేసుకునే పని చేసింది ఎవరో తెలియదా అని మండిపడింది.
గుజరాత్ మోడల్ అద్భుతం అంటూ పొగిడింది రేవంత్ రెడ్డి కాదా , అదానికి రాష్ట్రాన్ని అప్పగిస్తానంటూ ఒప్పందం చేసుకున్నది సీఎం కాదా , ఆప్ కీ అదాలత్ కార్యక్రమానికి వెళ్లి పీఎంకు ఓటు వేయమని బహిరంగంగానే చెప్పినోడు ఎవరో తెలియదా ..అప్పుడే పార్టీ మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పి, నదుల అనుసంధానంపై నోరు మెదపకుండా.. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టింది ఎవరో తెలియదా అని నిలదీసింది బీఆర్ఎస్. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రేవంత్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేదని పేర్కొంది.