దర్జాగా ప్లే ఆఫ్స్ కు చెన్నై
రాజస్థాన్ రాయల్స్ కు ఓటమి
చెన్నై – ఐపీఎల్ 2024లో మరోసారి సత్తా చాటింది చెన్నై సూపర్ కింగ్స్ . అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. చావో రేవో తేల్చు కోవాల్సిన సమయంలో జూలు విదిల్చింది రుతురాజ్ గైక్వాడ్ సేన. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తగ్గకుండా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు రుతురాజ్ గైక్వాడ్.
ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది 5 వికెట్లు కోల్పోయి. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే ఇబ్బందులు ఎదుర్కొంది.
ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన గైక్వాడ్ రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తన జట్టుకు గెలుపు అందించాడు. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. రుతురాజ్ 42 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. మిచెల్ 22 రన్స్ చేస్తే రచిన్ రవీంద్ర 27 పరుగులు చేయడంతో గట్టెక్కింది. 14 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది.