మీరిచ్చే తీర్పు అభివృద్దికి మార్పు
ఓటు హక్కు వినియోగించుకోండి
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్బంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన వీడియో సందేశాన్ని షేర్ చేశారు. తెలంగాణలో మే 13 సోమవారం అత్యంత కీలకమైన రోజుగా అభివర్ణించారు. పని చేసే వారికి తమ వీలువైన ఓటు వేయాలని ఆయన కోరారు.
ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దోహద పడుతుందని, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయని వాళ్లు అత్యంత నేరం చేసిన వారిగా మిగిలి పోతారని పేర్కొన్నారు.
రేపటి భవిష్యత్తు బాగు కోసమైనా మీరంతా ఇళ్లల్లోంచి బయటకు రావాలని సూచించారు. లేక పోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి వేసినా తప్పు లేదు. కానీ మీ విలువైన ఓటును మాత్రం ఉపయోగించు కోవాలని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.