SPORTS

ఐపీఎల్ నుంచి ఢిల్లీ అవుట్

Share it with your family & friends

చుక్క‌లు చూపించిన ఆర్సీబీ

బెంగ‌ళూరు – ఐపీఎల్ 2024లో జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ రేసులోకి వెళ్లింది. ఈసారి ఎలాగైనా క‌ప్ గెల‌వాల‌ని అనుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. రిష‌బ్ పంత్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ఆర్సీబీ.

నువ్వా నేనా అన్న రీతిలో ఆడాల్సిన మ్యాచ్ లో బిగ్ షాక్ త‌గిలింది ఢిల్లీకి. పంత్ లేక పోవ‌డం కూడా డీసీకి శాపంగా మారింది. చిన్న స్వామి స్టేడియంలో ఢిల్లీని ఏకంగా 47 ర‌న్స్ తేడాతో ఓడించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. తాము కూడా క‌ప్ రేసులో ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది.

దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో 5వ స్థానానికి చేరుకుంది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ టాప్ లో ఉండ‌గా రాజ‌స్తాన్ 2వ స్తానంలో కొన‌సాగుతోంది. ఇరు జ‌ట్లు ఇప్ప‌టి దాకా 12 మ్యాచ్ లు ఆడాయి. ఇంకా 2 మ్యాచ్ లు ఉన్నాయి. ఇక చెన్నై, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఆర్సీబీకి కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మూడు జ‌ట్ల‌కు ఒకే ఒక్క మ్యాచ్ కీల‌కం.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 140 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ప‌టేల్ 39 బంతులు ఆడి 57 ర‌న్స్ చేసింది. 5 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ద‌యాల్ 20 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే ఫెర్గూస‌న్ 23 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీసింది.

డుప్లెసిస్ 6 ర‌న్స్ చేస్తే కోహ్లీ 27 ర‌న్స్ చేసి ఔట్ అయ్యారు. జాక్స్ , పాటిదార్ స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టించారు. పాటిదార్ హాప్ సెంచ‌రీ చేస్తే గ్రీన్ 24 బంతులు ఎదుర్కొని 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు.