ఓటు ఆయుధం డెమోక్రసీకి మూలం
ప్రతి ఒక్కరు ఓటు వేయండని పిలుపు
హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) చీఫ్ , మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓటు వేశానని, మీరు కూడా ఓటు వేయడం మరిచి పోవద్దని కోరారు. ఓటు అన్నది వజ్రాయుధం. దానిని పదిలంగా కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు ఆకునూరి మురళి.
ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రధానంగా దేశానికి మూల స్తంభంగా ఉన్నటువంటి డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని పదిలంగా భద్ర పర్చు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడుపై ఉందని స్పష్టం చేశారు.
ఈ దేశం ప్రమాదంలో ఉందని, ప్రత్యేకించి కొన్ని శక్తులు కేవలం తమ స్వలాభం కోసం, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆకునూరి మురళి.
ఓటు వేయండి..ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. మన జీవితాలను అభివృద్ధి వైపు శాంతియుత జీవనం వైపు ప్రభావితం చేసేది పరిపాలన. అలాంటి పరిపాలన ఏ రాజకీయ పార్టీ కి అప్పచెప్పాలో నిర్ణయం చేసేది మన ఓటు అని పేర్కొన్నారు.