ఓటేయండి ఆశీర్వదించండి
మీ విలువైన ఓటు నాన్నకు నివాళి
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు బారులు తీరారు. ఇంకొన్ని చోట్ల చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకున్నా అంతటా ప్రశాంతంగానే ఉంది.
పోలింగ్ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం వైఎస్ షర్మిలా రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అరుదైన రాజకీయ నాయకుడు తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇవాళ ఆయన బౌతికంగా లేక పోయినప్పటికీ తను తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు సజీవంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికల పండగ వేళ తాను తన తండ్రిని స్మరించు కోకుండా ఉండలేక పోతున్నానని పేర్కొన్నారు. వైఎస్సార్ కడప లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారని , ఇప్పుడు తన బిడ్డగా తాను కూడా బరిలో ఉండడం తనకు సంతషం కలిగిస్తోందని అన్నారు.
మీ విలువైన వేసే ప్రతి ఓటు తన తండ్రికి నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.