స్వామీ దీవించు నన్ను గెలిపించు
విద్యారణ్య స్వామి దర్శన భాగ్యం
కరీంనగర్ జిల్లా – పోలింగ్ డే కావడంతో అందరి కళ్లు ఇప్పుడు కరీంనగర్ జిల్లాపై ఉన్నాయి. కారణం ఏమిటంటే ఇక్కడ పోటీ వన్ సైడ్ గా ఉంటుందని భారతీయ జనతా పార్టీ అంటోంది. కానీ ఈసారి బండి బోల్తా పడడం ఖాయమని, హస్తం హవా కొనసాగతుఉందని కాంగ్రెస్ చెబుతోంది. ఈ ఇద్దరిని కాదని గులాబీ కారు మాత్రం మాదే జోరంటోంది. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కూడా ప్రారంభమైంది.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ . పోలింగ్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఆయన తన సతీమణితో కలిసి శ్రీ మహా శక్తి దేవాలయంలోని అమ్మ వార్లను దర్శించుకున్నారు.
అక్కడే విడిది చేసిన జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్బంగా తనను గెలిపించాలని కోరారు. నీ విజయానికి ఢోకా లేదని, ప్రజలు నీవైపే ఉన్నారని పేర్కొన్నారు.
అంతా మంచే జరుగుతుందని, దేశంలో కూడా మోదీ ప్రభంజనం సాగుతుందని పేర్కొన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్ .