ప్రజలే చరిత్ర నిర్మాతలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జోగులాంబ గద్వాల జిల్లా – నాగర్ కర్నూల్ లోక్ సభ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం పోలింగ్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఓటు హక్కును తన స్వంత స్థలమైన ఆలంపూర్ లో ఉపయోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారని , పార్టీలు కాదన్నారు. ప్రజలు అమాయకులు కారని, వారు ఎవరు పని చేస్తారని అనుకుంటే వారి వైపు మొగ్గు చూపుతారని ఇది గతంలో చాలా సార్లు చూశామని పేర్కొన్నారు. తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నానని తెలిపారు.
మీరు కూడా ఓటు హక్కును వినియోగించు కోవాలని, ఇది దేశానికి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాకు జన్మను ఇచ్చిన ఆలంపూర్ గడ్డపై ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. ఉదయం నుంచే పోలింగ్ బూత్ ల వద్దకు ఓటర్లు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వమ్య దేశంలో ఇప్పుడు మనందరి భవిష్యత్తును నిర్ణయించే పోలింగ్ జరుగుతోందన్నారు.