SPORTS

దేశీవాలి టోర్నీలో ఆడాల్సిందే

Share it with your family & friends

ఇషాన్ కిష‌న్..అయ్య‌ర్ ల‌పై జే షా

ముంబై – జాతీయ జ‌ట్టులో ఆడాల‌ని అనుకునే క్రికెట‌ర్లు ఎవ‌రైనా స‌రే దేశీవాలి టోర్నీల‌లో త‌ప్ప‌నిస‌రిగా పాల్గొనాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్య‌ద‌ర్శి జే షా. జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీ పై ..వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు ఎంపిక‌పై స్పందించారు. కొంద‌రు క్రికెట‌ర్లు దేశీవాలి ఆట‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇక్క‌డ ఎవ‌రికీ ప్ర‌త్యేక‌త‌లు అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు జే షా. ఎవ‌రైనా ఎంత‌టి పెద్ద క్రికెట‌ర్ అయినా మిన‌హాయింపులు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. వారు చూపించిన ప్ర‌తిభ‌ను ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తార‌ని, ఇత‌రుల ఒత్తిళ్ల మేర‌కు ఎంపిక అంటూ ఉండ‌ద‌ని తెలిపారు. జే షా మీడియాతో మాట్లాడారు.

ఇషాన్ కిష‌న్ , శ్రేయాస్ అయ్య‌ర్ ల‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌కలం రేపింది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ఇషాన్ కిష‌న్ సుదీర్ఘ కాలం పాటు విరామం తీసుకున్నాడు. అయ్య‌ర్ కొన్ని మ్యాచ్ లు మాత్ర‌మే ఆడ‌డంపై ప్రస్తావించారు.

సంజూ శాంస‌న్ దేశీవాలి టోర్నీలో పాల్గొన్నాడు. ఐపీఎల్ లో త‌న ప్రతిభను క‌న‌బ‌ర్చాడు. అందుకే అత‌డిని సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ఎంపిక చేశాడ‌ని తెలిపారు జే షా.

“నా పాత్ర కేవలం అమలు చేయడమే. మరియు సంజు (శాంసన్) వంటి కొత్త ఆటగాళ్లను (స్థానంలో) పొందారు. ఎవరూ అనివార్యమైనది,” అన్నారాయన.