ఓటేయండి ఆదరించండి – మోదీ
ఓటర్లకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13 సోమవారం నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 143 కోట్ల మంది భారతీయులకు ఇది ఓ పండుగగా పేర్కొన్నారు పీఎం.
ఇప్పటి దాకా 3 విడతల పోలింగ్ ముగిసిందని, ప్రస్తుతం 4వ దశ పోలింగ్ జరుగుతోందని తెలిపారు. మొత్తం దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని, యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు కూడా ఈ ఓటింగ్‌కు బలం చేకూరుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని అని పేర్కొన్నారు మోదీ.. రండి, మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దామని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.