ఎమ్మెల్యే నిర్వాకం ఓటరు ఆగ్రహం
చేయి చేసుకున్న అన్నాబత్తుని శివకుమార్
గుంటూరు జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైంది. పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరో వైపు పోలింగ్ కేంద్రం వద్ద ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికగైంది గుంటూరు జిల్లలోని తెనాలి నియోజకవర్గం.
ప్రస్తుతం ఈ శాసన సభ స్థానానికి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన అన్నాబత్తుని శివ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ ఓటింగ్ కేంద్రానికి వచ్చారు. వచ్చిన వెంటనే క్యూలో నిలిచి ఉన్న ఓటర్ చెంపపై ఎమ్మెల్యే కొట్టారు. అక్కడ ఉన్న వారంతా విస్తు పోయారు. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లవుతుంది.
దీంతో తన చెంపపై కొట్టిన ఎమ్మెల్యేను సదరు ఓటరు కూడా ఎదురు తిరిగాడు. ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో దౌర్జన్యంగా దాడికి దిగిన శివకుమార్ పై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పై దాడికి దిగారు. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తంగా ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.