మాధవీలతపై కేసు నమోదు
బుర్ఖా తొలగించిన అభ్యర్థి
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లత సంచలనంగా మారారు. ఆమె సోమవారం పోలింగ్ సందర్భంగా పాత బస్తీలో పర్యటించారు. పలు పోలింగ్ బూత్ లను సందర్శించారు. ఇదే సమయంలో ఓటు వేసేందుకు వేచి ఉన్న ముస్లిం మహిళలను ఆరా తీశారు. సరిగా ఉందా లేక ఎవరి పేరుతోనైనా ఓటు వేస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై సీరియస్ అయ్యారు ఎంఐఎం చీఫ్ , ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవీలతపై.
ముస్లిం మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఆమె వ్యవహరించారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఎంఐఎం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
దీంతో మలక్ పేట పోలీస్ స్టేషన్ లో బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై పోలీసులు ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద కేసు నమోదు చేశారు.