చింతమడకలో ఓటేసిన కేసీఆర్
భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగం
సిద్దిపేట జిల్లా – భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పోలింగ్ సందర్బంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా లోని స్వంత ఊరు చింతమడకకు చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి శోభ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున గుమిగూడారు. కేసీఆర్ తనే వారికి అభివాదం చేశారు.
తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. ఇళ్లల్లో ఉండకుండా సాయంత్రం వరకు సమయం ఉందని , ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.
ఓటు వేయక పోతే నేరం చేసినట్టేనని పేర్కొన్నారు. అది మనందరి బాధ్యతనే కాదు 143 కోట్ల భారతీయుల విద్యుక్త ధర్మమని స్పష్టం చేశారు. ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని , ఆ విషయం తెలుసుకుంటే మంచిందన్నారు కేసీఆర్.
ఓటు ప్రజాస్వామ్యానికి మూలం, భారత రాజ్యాంగానికి ఆయువు పట్టు అని స్పష్టం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.