జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల పండుగ
ఓటు కోసం పోటెత్తారు
జమ్మూ కాశ్మీర్ – సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కాశ్మీర్ లో ఊహించని రీతిలో జనం రోడ్ల పైకి వచ్చారు. నిరంతరం ఎన్ కౌంటర్లు, తుపాకుల మోతలతో, బుల్లెట్ల వర్షంతో దద్దరిల్లే ఈ ప్రాంతం ఉన్నట్టుండి ఓటర్లతో నిండి పోయింది. ఎక్కడ చూసినా యువత ఉత్సాహంగా తాము సైతం ఓటు వేస్తామంటూ ప్రకటించారు.
ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా తాము సైతం ఈ దేశ భవిష్యత్తు కోసం ఓటు వేస్తామని ప్రకటించారు. ఈ మేరకు భారీ ఎత్తున ఊహించని రీతిలో పోలింగ్ శాతం పెరగడం విశేషం. ఇదే విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఇందుకు సంబంధించిన ఓటర్ల ఫోటోలను పంచుకున్నారు.
ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. భారీ ఎత్తున పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చి జమ్మూ కాశ్మీర్ వాసులు \ఓటు వేయడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను అభినందించారు.