మట్టి బిడ్డలను మరిచిపోం – ఖర్గే
ఆదివాసీలకు కాంగ్రెస్ అండ
జార్ఖండ్ – ఈ దేశం మరిచి పోలేని సమాజం ఏదైనా ఉందంటే అది అడవి బిడ్డలైన ఆదివాసీలేనని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జార్ఖండ్ లోని చత్రాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
గొప్ప సంఘ సంస్కర్క రాజా రామ్ మనోహర్ రాయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఖర్గే. ఆయన ఛత్ర భూమి నుండి ప్రేరణ పొందారని చెప్పారు. 150 మంది విప్లవకారులు వీర మరణం పొందిన 1857 విప్లవంలో ఛత్ర యుద్దం అత్యంత ముఖ్యమైనదని అన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్రలో తాము ప్రత్యేకంగా ఆదివాసీల గురించి ప్రస్తావించామన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చామని తెలిపారు. అందుకే ఆదివాసీ సంకల్ప్ ను చేర్చడం జరిగిందని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే. ఆదివాసీలు సేకరించే ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. చట్టంలోని గిరిజన వ్యతిరేక సవరణలన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు ఏఐసీసీ చీఫ్.