ఓటర్లు..కార్యకర్తలకు దండాలు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసింది. భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు వేసినా ఎందుకనో మరోసారి హైదరాబాద్ నగర వాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు.
ఇదిలా ఉండగా పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు తన్నీరు హరీశ్ రావు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు గంప గుత్తగా కాంగ్రెస్ ను బొంద పెట్డడం ఖాయమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కనీసం 17 స్థానాలలో 14 సీట్లకు పైగానే వస్తాయని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చుక్కలు చూపించ బోతున్నారని, ఈ విషయం వచ్చే జూన్ 4న తేలనుందని స్పష్టం చేశారు తన్నీరు హరీశ్ రావు.
ఇది పక్కన పెడితే ప్రధానంగా ప్రవాస ఆంధ్రులు ఇక్కడ ఉన్న వారంతా ఏపీకి చెక్కేశారు. దాదాపు 40 లక్షల మందికి పైగా ఏపీలో ఓటు వేసేందుకు వెళ్లడం విస్తు పోయేలా చేసింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి , అన్ని వనరులను దోచుకున్న వారంతా మరోసారి చంద్రబాబుకు ఓటేసేందుకు క్యూ కట్టడం ఒకింత ఆలోచించాల్సిన విసయం.