రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు చేరేనా
సంక్లిష్టంగా మారిన ప్లే ఆఫ్స్
హైదరాబాద్ – ఐపీఎల్ 2024 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. ప్లే ఆఫ్స్ కు ఏ జట్లు చేరుకుంటాయనే దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగు జట్లకు గాను ఇప్పటికే వరుస విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్ టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆ జట్టు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడింది. 8 మ్యాచ్ లలో గెలుపొందింది. 16 పాయింట్లు సాధించింది. సంజూ శాంసన్ సేన ఇంకా 2 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఒకటి గెలవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం మిగతా స్థానాలలో చెన్నై , సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఆయా జట్లకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. మొత్తంగా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పేలవమైన ప్రదర్శన ఇబ్బంది కరంగా మారింది.
ప్రధానంగా ఇంగ్లండ్ కు చెందిన ప్లేయర్లు ఐపీఎల్ ను వీడనున్నారు. వారికి సీరీస్ ఉండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ జట్టును వీడనున్నారు.