ప్లే ఆఫ్స్ పై చెన్నై ఫోకస్
ఆసక్తికరంగా జట్ల మధ్య పోటీ
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో ఏమైనా మ్యాజిక్ చేయబోతోందా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. ఆరంభంలో తడబాటుకు గురైనా సెకండాఫ్ లో దుమ్ము రేపుతోంది. బలమైన జట్లను మట్టి కరిపించింది. మహేంద్ర సింగ్ ధోనీ ఉండడంతో ఆ జట్టుకు అదనపు బలంగా మారింది. ప్రస్తుతం ఈ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది.
ప్లే ఆఫ్స్ కు నాలుగు జట్లు రావాల్సి ఉండగా ఇప్పటికే వరుస విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్ టాప్ లో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఇక మిగిలిన 3 స్థానాలకు బిగ్ ఫైట్ కొనసాగుతోంది.
రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అనూహ్యంగా బరిలో ఉండడం ఫ్యాన్స్ ను మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రతి జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే రాజస్థాన్ 12 మ్యాచ్ లు ఆడింది. చెన్నై 13 మ్యాచ్ లు ఆడగా ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.
అయితే ఈ జట్లతో పాటు ఢిల్లీ, లక్నో జెయింట్స్ ఇంకా పోటీలో ఉండడం విశేషం. ఇవాళ ఢిల్లీ , లక్నో మధ్య జరిగే మ్యాచ్ లో ఢిల్లీ గెలిస్తే రాజస్థాన్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే రెండింటిలో ఒకటి గెలవాల్సి ఉంటుంది. ఈనెల 18న చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరుతో ఆడాల్సి ఉంది.