అందరి కళ్లు ఆర్సీబీ పైనే
అనూహ్యంగా దూసుకొచ్చింది
హైదరాబాద్ – ప్రస్తుతం అందరి కళ్లన్నీ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో సెకండాఫ్ లో అద్భుతంగా రాణించింది ఆ జట్టు. కష్ట కాలంలో తోడుగా ఉంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ.
ఊహించని రీతిలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం విశేషం. నాలుగు జట్లకు గాను ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ 18 పాయింట్లు సాధించి టాప్ లో నిలిచింది. ఇక మిగతా 3 స్థానాలకు పోటీ భారీగా పోటీ నెలకొంది. ఇందు కోసం ఏకంగా ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.
ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఢిల్లీ, లక్నో కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇవాళ మరో కీలకమైన పోరు కొనసాగనుంది. ఢిల్లీ, లక్నో జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై ఇతర జట్ల స్థానాలు ఖరారు కానున్నాయి.
ఏది ఏమైనా విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఐపీఎల్ 17వ సీజన్. ఏం జరుగుతుందనేది కొన్ని రోజులు ఆగితే తేలుతుంది.