ఇంగ్లండ్ క్రికెటర్ల ఇంటి బాట
ఫ్రాంచైజీ జట్లకు బిగ్ షాక్
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో ఆయా జట్లకు కోలుకోలేని షాక్ తగిలింది. దీనికి కారణం ఏమిటంటే వేలం పాటలో భారీ ధర పలికారు ఇంగ్లండ్ క్రికెటర్లు. ఊహించని రీతిలో వారంతా ఇంటి బాట పట్టారు. దీనికి కారణం వచ్చే నెల జూన్ లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీకి రెండు దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఒకటి అమెరికా కాగా మరొకటి వెస్టిండీస్.
దీంతో ఇప్పటికే అన్ని జట్లు తమ తుది టీమ్ లను ప్రకటించేశాయి. అయితే వరల్డ్ కప్ కు ముదు సన్నాహక మ్యాచ్ లను ఆడాల్సి ఉంది ఇంగ్లండ్ జట్టు. దీంతో ఆ జట్టులో కీలకంగా ఉన్న ఆటగాళ్లను రావాల్సిందిగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. ఇప్పటికే కాంట్రాక్టు కుదుర్చుకున్న ప్లేయర్లంతా పెట్టే బేడా సర్దుకుని బయలుదేరి వెళ్లారు.
ప్రధానంగా ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ ఆడుతూ వస్తున్న ప్రధాన ఆటగాడు జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాడు. సోమవారం తన భార్యతో కలిసి ఇంగ్లండ్ పయనమయ్యాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టుతో ఇంగ్లండ్ టి20 సీరీస్ ఆడాల్సి ఉంది. పంజాబ్ తరపున ఆడుతున్న లివింగ్ స్టోన్ , ఆర్సీబీ జట్టులో ఆడుతున్న జాక్స్ , టాప్లీ కూడా యూకే విమానం ఎక్కారు.
ఇక కోల్ కతా తరపున ఆడుతున్న సాల్ట్ , సీఎస్కే ఆల్ రౌండర్ మోయిన్ అలీ కూడా విమానం ఎక్కేందుకు రెడీ అయ్యారు.