బీజేపీకి భారీగా సీట్లు – పీకే
నాలుగు రాష్ట్రాలలో హవా
బీహార్ – భారతీయ జనతా పార్టీకి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారీగా సీట్లు రానున్నాయని భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.
ఈసారి తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ , ఏపీలలో బీజేపీకి సీట్లు ఎక్కువగా రానున్నాయని అంచనా వేశారు. సాంప్రదాయకంగా బలహీనంగా ఉన్న తూర్పు , దక్షిణాదిలలో బిజెపి గణనీయమైన ఓటు బ్యాంకు పొందనుందని, దీంతో సీట్లు ఊహించని రీతిలో రానున్నాయని తెలిపారు ప్రశాంత్ కిషోర్.
దక్షిణ భారతం, తూర్పు భారత దేశంలో ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా పెరగడం ఒకింత విస్తు పోయేలా చేస్తుందన్నారు. సమర్థవంతమైన పాలన, సుస్థిరమైన నాయకత్వం పట్ల ఓటర్లు ప్రభావితం అవుతున్నారని , ఈ వేవ్ ఇలాగే కొనసాగితే బీజేపీకి ఆశించిన దానికంటే ఎక్కువగా సీట్లు పొందనుందని తెలిపారు.
ఇదిలా ఉండగా మోదీ అనుకూల మీడియా మాత్రం 400 సీట్లకు పైగా బీజేపీకి వస్తాయని కాంగ్రెస్ కూటమి కేవలం 100 సీట్లకే పరిమితం కాబోతోందని, మిగతా సీట్లను బీజేపీ అనుబంధ పార్టీలు పంచుకోనున్నట్లు పేర్కొంటున్నాయి.