NEWSANDHRA PRADESH

ఎన్డీయేకు 400 సీట్లు ప‌క్కా

Share it with your family & friends

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని వార‌ణాసికి చేరుకున్నారు. ఇవాళ పీఎం న‌రేంద్ర మోదీ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు చంద్ర‌బాబు నాయుడు.

జాతీయ మీడియాతో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన ఎన్డీయే కూట‌మికి క‌నీసం ఈసారి ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు. అంత‌కంటే ఎక్కువే వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఈరోజు చారిత్రాత్మ‌క‌మైన రోజుగా తెలిపారు.

ప్ర‌పంచంలోనే భార‌త దేశం కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం, సుస్థిరమైన పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ కొలువు తీర‌డం ఖాయ‌మ‌ని , ఇక మిగిలింది ఫలితాలు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.