NEWSNATIONAL

మోడీ పీఎం కావ‌డం ఖాయం

Share it with your family & friends

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీర‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం యూపీలోని వారణాసిలో మోదీ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు. ఆయ‌న‌తో పాటు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా జాతీయ మీడియాతో మాట్లాడారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తాను ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉండ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోడీ అంటే త‌న‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌న్నారు. ఏపీలో జ‌న‌సేన కూట‌మి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా మోదీ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి అతిర‌థ మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. వీరిలో బీజేపీ చీఫ్ న‌డ్డా, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ , బీహార్ కు చెందిన చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు.

వీరితో పాటు అభినంద‌న సంగ్మా , ప్ర‌పుల్ ప‌టేల్ , మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే , రాందాస్ అథవాలే, హ‌ర్దీష్ పూరి, జితిన్ రామ్ మాంఝీ, ప‌శుప‌తి ప‌రాస్ , ఉపేంద్ర కుష్వాహా, సంజ‌య్ నిషాద్ , జ‌యంత్ చౌద‌రి, ఓపీ రాజ్ భ‌ర్ , అనుప్రియా ప‌టేల్ , అన్షుమ‌ణి రామ్ దాస్ , అతుల్ బోరా, ప్ర‌మోద్ బోరో, భూపేంద్ర చౌద‌రి, దేవ నాథ‌ణ్ యాద‌వ్ . టి, జీకే వాస‌న్ , తుషార్ వెల్ల‌ప‌ల్లి మోదీ వెంట ఉన్నారు. కాగా అజిత్ ప‌వార్ , నితీశ్ కుమార్ ముంద‌స్తు మీటింగ్ ల వ‌ల్ల రాలేదు.