ఎన్డీయే నేతలకు మోడీ థ్యాంక్స్
మీ మద్దతు మరిచి పోలేను
ఉత్తరప్రదేశ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని వారణాసిలో లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన అధినేతలు , ముఖ్యమంత్రులు , కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
కాశీని దర్శించుకున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలు తన కోసం రావడం, బేషరతుగా మద్దతు ప్రకటించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. తమ కూటమి జాతీయ ప్రగతికి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిబద్దతతో కృషి చేస్తానని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
దేశ పురోగతి కోసం కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు పీఎం. ఇదిలా ఉండగా పీఎం నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ , బీహార్ కు చెందిన చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు.
వీరితో పాటు అభినందన సంగ్మా , ప్రపుల్ పటేల్ , మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే , రాందాస్ అథవాలే, హర్దీష్ పూరి, జితిన్ రామ్ మాంఝీ, పశుపతి పరాస్ , ఉపేంద్ర కుష్వాహా, సంజయ్ నిషాద్ , జయంత్ చౌదరి, ఓపీ రాజ్ భర్ , అనుప్రియా పటేల్ , అన్షుమణి రామ్ దాస్ , అతుల్ బోరా, ప్రమోద్ బోరో, భూపేంద్ర చౌదరి, దేవ నాథణ్ యాదవ్ . టి, జీకే వాసన్ , తుషార్ వెల్లపల్లి మోదీ వెంట ఉన్నారు. కాగా అజిత్ పవార్ , నితీశ్ కుమార్ ముందస్తు మీటింగ్ ల వల్ల రాలేదు.