ఢిల్లీ దెబ్బ లక్నో విలవిల
ప్రతీకారం తీర్చుకున్న క్యాపిటల్స్
న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపింది రిషబ్ పంత్ సేన. ప్లే ఆఫ్స్ కు ఎలాగైనా చేరు కోవాలన్న కసితో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కు షాక్ ఇచ్చింది.
ఇప్పటికే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. పొరెల్ , స్టబ్స్ సూపర్ షో ప్రదర్శించారు. అనంతరం బరిలోకి దిగిన లక్నో ఇషాంత్ శర్మ దెబ్బకు వికెట్లు పారేసుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ కు దర్జాగా వెళ్లింది సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్.
ఢిల్లీ లక్నోను 19 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఢిల్లీ జట్టులో పొరెల్ 58 రన్స్ చేస్తే స్టబ్స్ 57 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం మైదానంలోకి వచ్చిన లక్నో 20 ఓవర్లలో 189 రన్స్ చేసింది. పూరన్ 27 బంతులు ఆడి 61 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అర్షద్ ఖాన్ 33 బంతులు ఆడి 58 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 3 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.