SPORTS

హెచ్‌సీఏ ఎథిక్స్ ఆఫీస‌ర్ గా ఈశ్వ‌ర‌య్య

Share it with your family & friends

నియ‌మించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

హైద‌రాబాద్ – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ పై ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే స‌ద‌రు క్రీడా సంస్థ‌కు గ‌తంలో భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ తో పాటు అప్ప‌టి కార్య‌వ‌ర్గంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై విచార‌ణ‌కు కూడా ఆదేశించింది. ఈ మేర‌కు కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఇదే స‌మ‌యంలో హెచ్ సీ ఏకు ఎన్నిక‌లు జ‌రిగాయి. అజ్జూ ప్యాన‌ల్ ఓట‌మి పాలైంది. కొత్త పాల‌క‌వ‌ర్గం కొలువు తీరింది. దీంతో ఏం జ‌రుగుతోంద‌నే దానికి సంబంధించి ఆరా తీసేందుకు గాను బీసీసీఐ రిటైర్డ్ న్యాయ‌మూర్తిని నియ‌మించాల‌ని ఆదేశించింది .

ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది . ఇందులో భాగంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేసిన జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ కు ఎథిక్స్ క‌మిటీ చీఫ్ గా నియ‌మించింది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు సాద‌ర స్వాగతం ప‌లికారు హెచ్ సీఏ అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కోశాధికారి, త‌దిత‌రులు.