SPORTS

హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ఆహ్వానం

Share it with your family & friends

ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పిలుపు

ముంబై – ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరు పొందిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టుకు మాజీ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్ గా ఉన్నారు. గ‌తంలో ర‌వి శాస్త్రి త‌ర్వాత రాహుల్ కొలువు తీరాడు. ఇక క్రికెట్ అకాడ‌మీ హెడ్ గా రాహుల్ ద్ర‌విడ్ వేసిన ముద్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇవాళ భార‌త జ‌ట్టులో యువ ఆట‌గాళ్లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు అత‌నే.

అందుకే అప్ప‌టి బీసీసీఐ బాస్ సౌవ‌ర్ గంగూలీ ఏరి కోరి రాహుల్ ద్ర‌విడ్ ను హెడ్ కోచ్ గా నియ‌మించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న కాల ప‌రిమితి ముగియ‌నుంది కొద్ది రోజుల్లో. దీంతో మ‌రో జ‌ట్టుకు శిక్ష‌కుడి కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది బీసీసీఐ.

భారీ ఎత్తున వేత‌నంతో పాటు ఇత‌ర స‌దుపాయాలు కూడా ఉండ‌డంతో ఈ ప‌ద‌వి కోసం పెద్ద ఎత్తున పోటీ ప‌డే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌డంతో పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు.