ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్
80.66 శాతం నమోదైందన్న ఈసీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ నమోదైందని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తుది పోలింగ్ శాతం ప్రకటించారు. ఈనెల 13వ తేదీన పోలింగ్ ముగిసింది. చాలా చోట్ల చెదురు మదురు సంఘటనలు జరిగాయి. అయితే రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సీఈవో .
బుధవారం ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఏపీలో రికార్డు స్థాయిలో నమోదైందని చెప్పారు. ఏకంగా 80.66 శాతం పోలింగ్ నమోదైందని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ పరంగా 1.1 శాతం నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా 81.76 పోలింగ్ నమోదైనట్లు తెలిపారు సిఈవో.
పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను తరలించినట్లు పేర్కొన్నారు. వచ్చే నెల జూన్ 4న తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆయా పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటికే పర్మిషన్ లేకుండా ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించామన్నారు.