రైతులకు న్యాయం చేయండి – కేటీఆర్
రాజకీయాలు పక్కన పెట్టాలని పిలుపు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ వారి గురించి పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం , ఆ తర్వాత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా సీఎంకు మారిందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్.
ఊ అంటే తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పే రేవంత్ రెడ్డి ఎందుకు రైతుల గురించి పట్టించు కోవడం లేదని అన్నారు. ముందు రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
బుధవారం నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ . నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.