కేజ్రీవాల్ పై షా షాకింగ్ కామెంట్స్
స్వాతి మలివాల్ సమస్య ఉందిగా
న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్బంగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
తాను చట్టానికి లోబడి ఉండే వ్యక్తినని, అయితే భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని అన్నారు. ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారనేది త్వరలోనే తేలుతుందన్నారు.
ఇది సాధారణమైన తీర్పు కాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి షా ఏఎన్ఐ చీఫ్ ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ దేశంలో చాలా మంది ప్రజలకు ఉన్న వెసులుబాటే అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఉంటుందని తాను నమ్ముతానని అన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ మరో సమస్యలో ఇరుక్కున్నాడని అన్నారు. స్వాతి మలివాల్ తీవ్రమైన ఆరోపణలు చేసిందన్నారు.