ఏపీ సీఎస్..డీజీపీకి సమన్లు
హాజరు కావాలని ఈసీ ఆదేశం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి చోటు చేసుకున్న ఘటనలపై సీరియస్ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) . వెంటనే ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానంగా ఎన్నికలు మే 13న సోమవారం ముగిశాయి. అయినా ఇప్పటికీ ఇంకా పలు చోట్ల దాడులకు తెగ బడుతున్నారు ఇరు పార్టీలకు చెందిన నేతలు. చాలా చోట్ల పోలీసులు చోద్యం చూడటం, పట్టించుకోక పోవడం ప్రధానంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వైసీపీ , టీడీపీ కూటమి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకుంది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామని, అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి 2 రోజుల్లో అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై నిర్లక్ష్యం వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజేపీ గుప్తాపై . ఈ మేరకు ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. ఏపీ డీజీపీ, సీఎస్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.