ప్రమాదంలో ప్రజాస్వామ్యం..రాజ్యాంగం
ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన చెందారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా తన కూతురు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా రాయ్ బరేలి నుంచి తనను ఆదరించారని, కానీ అనారోగ్యం కారణంగా తాను ఈసారి ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం లేదని స్పష్టం చేశారు.
మీరందించిన ప్రేమ, అనురాగం ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు సోనియా గాంధీ. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ప్రజలు మేలు కోవాలని, మీ విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని పిలుపునిచ్చారు.