బీజేపీ సర్కార్ ఔర్ ఏక్ బార్
400 సీట్లు రావడం ఖాయం
న్యూఢిల్లీ – మరోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ, రోడ్ షో చేపట్టారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్లకు ఇరు వైపులా మోదీని చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు .
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ప్రజల మనిషినని అన్నారు. తన జీవిత కాలమంతా ప్రజా సేవకే అంకితం కావడం జరిగిందని చెప్పారు. తనకు ఉండేందుకు ఇల్లు లేదని, ప్రయాణః చేసేందుకు కారు కూడా లేని పేద వాడినని అన్నారు.
తాను ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు. ఎందుకంటే తమకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ది చెందాలంటే కేవలం తమ ప్రభుత్వం మాత్రమే ఉండాలన్నారు. 143 కోట్ల మంది భారతీయులు తనను పీఎంగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు నరేంద్ర మోదీ.