DEVOTIONAL

ముగిసిన యాగం ఇక విదేశీ ప్ర‌యాణం

Share it with your family & friends

ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఆశీర్వాదం

అమ‌రావ‌తి – తాడేప‌ల్లి గూడెంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన యాగం ముగిసింది. రాష్ట్రంలో శాస‌న స‌భ , లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్బంగా యాగాన్ని చేప‌ట్టారు. మొత్తం 41 రోజుల పాటు ఈ యాగం చేప‌ట్టారు. ఇందులో 45 మంది వేద పండితులు పాల్గొన్నారు.

భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో వేద పండితుల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంతా బాగుండాల‌ని, క‌లకాలం సుఖ సంతోషాల‌తో , అష్ట‌యైశ్వ‌ర్యాల‌తో, ఆయురారోగ్యాల‌తో విల‌సిల్లుతూ ఉండాల‌ని ఈ సంద‌ర్బంగా యాగాన్ని నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా సీఎంకు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేసి, ఆశీర్వ‌చ‌నాలు ఇచ్చారు. కాగా పోలింగ్ ముగియ‌డంతో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. ఆయ‌న‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ప్ర‌స్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ మేర‌కు త‌న‌కు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ మేర‌కు కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధించిన పూర్తి వివ‌రాలు, ఫోన్, ఈమెయిల్ , చిరునామా , పాస్ పోర్టు వివ‌రాలు అంద‌జేయాల‌ని సూచించింది.