SPORTS

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు బిగ్ షాక్

Share it with your family & friends

పంజాబ్ చేతిలో ఓట‌మి

అస్సాం – ఐపీఎల్ 2024లో భాగంగా గౌహ‌తిలో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓట‌మి పాలైంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నా వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాల‌వ‌డం ఆ జ‌ట్టును నిరాశ‌కు గురి చేసింది.

ప్ర‌ధానంగా ప్రారంభంలో అదుర్స్ అనిపించిన కెప్టెన్ సంజూ శాంస‌న్ సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. రెండు డకౌట్లు, 15, 18 ప‌రుగుల‌తో నిరాశ ప‌రిచాడు. మ‌రో వైపు జాస్ బ‌ట్ల‌ర్ యూకేకు వెళ్లి పోవ‌డంతో ఆ జ‌ట్టుకు అద‌న‌పు భారం ప‌డింది.

ముందుగా బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోయినా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. కెప్టెన్ సామ్ క‌ర‌న్ దుమ్ము రేపాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. చివ‌రి వ‌ర‌కు ఉండి త‌న జ‌ట్టును గెలిపించాడు.

దీంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.