జనం చూపు కూటమి వైపు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
ఉత్తర ప్రదేశ్ – దేశ ప్రజలంతా మూకుమ్మడిగా భారత కూటమి వైపు చూస్తున్నారని అన్నారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉత్తర ప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలంతా గంప గుత్తగా ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. దేశంలో గత 10 ఏళ్లుగా మోదీ సాగిస్తున్న అరాచక, అస్తవ్యస్త పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు ప్రియాంక గాంధీ.
వచ్చే జూలై నుంచి ప్రతి నెల నెలా మహిళల ఖాతాలో రూ. 8,500 అంటే ఏడాదికి రూ. లక్ష జమ చేస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు. ఈ విషయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేని ఫెస్టోలో ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం సంపన్నుల కోసం మాత్రమే పని చేస్తోందని ఆరోపించారు. వారికి పేదలు, మధ్య తరగతి ప్రజలు అక్కర్లేదన్నారు.