TELANGANANEWS

కాంగ్రెస్ మోసం రైతుల‌కు శాపం

Share it with your family & friends

ధ్వ‌జ‌మెత్తిన భార‌త రాష్ట్ర స‌మితి

మెద‌క్ జిల్లా – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. రైతుల‌కు మ‌ద్ద‌తుగా పోరాటం చేశారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న రైతు వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.

క‌రెంట్ కు క‌ట‌క‌ట ఏర్ప‌డింద‌ని, పండించిన పంట‌కు గిట్టు బాటు ధ‌ర క‌ల్పించ‌డం లేద‌ని, రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు. మెద‌క్ జిల్లా దుబ్బాక‌లో ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో రైతులు కూడా పాల్గొన్నారు.

ఎన్నికల్లో పండిన వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పి మళ్లీ నిన్నటి రోజున సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తానని సీఎం చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆరు గాలం పండించే రైతుల ప‌ట్ల ఎందుకు ఇంత‌టి వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే.